కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన నిజాంసాగర్ మండలానికి చెందిన మల్లికార్జున్‌ను మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. సోమవారం రాష్ట్ర రాజధానిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం నుండి పలువురు నాయకులు పాల్గొన్నారు.
సన్మానం కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, మిర్జాపుర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, హన్మాండ్లు స్వామి, మాజీ సొసైటీ చైర్మన్ కొండ గంగాధర్, విట్టల్ గురిజి, సంగయ్యప్ప తదితరులు పాల్గొని నూతన డీసీసీ చీఫ్ మల్లికార్జున్‌కు శాలువా కప్పి సన్మానించారు. అలాగే ఈ సందర్భంగా సాయి పటేల్‌ను కూడా ఘనంగా అభినందించారు.
నాయకులు మాట్లాడుతూ, మల్లికార్జున్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ, మండల స్థాయిలో మరింత బలపరిచే దిశగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం మల్లికార్జున్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
