• Thu. Jun 4th, 2026

స్థానిక ఎన్నికల్లో యువత కీలక భూమిక పోషించాలి: మద్నూర్ యువజన అధ్యక్షుడు హనుమంత్ యాదవ్

Avatar photo

BySangayappa matapathi

Nov 26, 2025

రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని మద్నూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ సూచించారు. మద్నూర్ మండలంలోని అన్ని గ్రామాల యువజన అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు అందిస్తున్న సేవలు, కొనసాగుతున్న పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేయడం యువత ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో డోర్–టు–డోర్ ప్రచారం, వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతం చేయాలని హనుమంత్ యాదవ్ పిలుపునిచ్చారు.

సమావేశం అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *