జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు
ఢిల్లీ: జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో యువతకు టెలికాం రంగంలో శిక్షణా కార్యక్రమాలు చేపట్టి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.
జుక్కల్ నియోజకవర్గాన్ని స్వయంగా సందర్శించి, ప్రాథమిక స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గమనించాలని మంత్రి గారిని ఆహ్వానించారు.
ఈ ప్రతిపాదనలపై స్పందించిన మంత్రి గారు సానుకూలంగా స్పందించి, జుక్కల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 3 కొత్త BSNL టవర్స్ మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇది జిల్లాలో టెలికాం కనెక్టివిటీ మెరుగుపరచడంలో కీలకంగా నిలవనుంది.
- ఈ సమావేశంలో NRI మరియు ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ బుజంగారి భాస్కర్ రెడ్డి , ఓబీసీ నాయకుడు సాయి పటేల్ కూడా పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
