తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జుక్కల్ (SC) నియోజకవర్గ ERO & జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ హాజరై, ఓటర్ జాబితా చేర్పులు, తొలగింపులు, మార్పులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై వివరించారు. రాజకీయ పార్టీలు BLO లకు సహకరించాలని, బూత్ లెవెల్ అసిస్టెంట్‌లను నియమించుకోవాలని సూచించారు.
తదుపరి, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SIR (Special Intensive Revision) షెడ్యూల్ ప్రకారం ఓటర్ జాబితా పునఃసమీక్షను తప్పులు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు ఎం.డి. ముజీబ్, బి. అనిల్, వేణుగోపాల్ గౌడ్, లత, బిక్షపతి, మారుతి, రాజా నరేందర్ గౌడ్, నాయబ్ తహసీల్దార్లు శరత్, హేమలత, శివ రామకృష్ణ, రాజకీయ పార్టీ ప్రతినిధులు డి. సాయిలు, టి. సంతోష్, బన్సి పటేల్, ఎబిత్వర్ రోహిదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
