భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా, మద్నూర్ మార్కెట్ కమitee ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్మరణ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ —
ఇందిరా గాంధీ గారు దేశ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మహానాయకురాలని, 1971 యుద్ధ విజయం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని గుర్తుచేశారు.
దేశ ప్రయోజనం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలి ఆలోచనలు, సేవాభావం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారస్ సాయిలు, రామ్ పటేల్, , రమేష్ సీనుపటేల్, విట్టాల్ గురిజి,కొండ గంగాధర్,
రమేష్ వటనల్ వార్ ,ప్రజ్ఞకుమార్,హన్మంత్ యాదవ్,హన్మాండ్లు స్వామి, బండి గోపి,రాములు,ఆముల్,,విట్టల్, రవి తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
