మద్నూర్‌లో కొనసాగుతున్న కార్తీకమాస ప్రభాత్ పేరి …
భక్తుల సందడి
మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాస ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కడ లేని విధంగా ఇక్కడ madnoor లో ప్రభాత్ పేరి కొనసాగుతుంది మొత్తం 33 రోజుల పాటు కొనసాతుంది ఇప్పటికి 28 రోజులు పూర్తి చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. దాదాపు 100 సంవత్సరాల నుండి ఉందని గ్రామస్థులు చెప్తున్నారు
ప్రతి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో భక్తులు నిద్రలేచి, బాలాజీ మందిరం నుండి భజనలతో ప్రభాత్ పేరి ప్రారంభిస్తున్నారు. గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ భక్తి గీతాలు పాడడం, హారతులు చేయడం ఈ కార్యక్రమంలో విశిష్టతగా నిలుస్తోంది.
గ్రామంలో ఉన్న జంగం మహేశ్వరుల తో ప్రభాత్ పేరి గ్రామస్థుల ఇండ్ల ముందు ప్రభాత్ పేరి చేరుకున్నప్పుడు భక్తులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు.
స్థానికులు మాట్లాడుతూ —
> “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మన గ్రామంలో జరగడం ఎంతో గర్వకారణం. భక్తి, సామూహిక ఏకత, ఆరోగ్య పరిరక్షణ… అన్ని కలిగిన పవిత్ర సంప్రదాయం ఇది” అన్నారు.
ప్రభాత్ పేరి ప్రత్యేకతలు
👉కార్తీకమాసం పవిత్రతతో నిర్వహణ
👉బ్రహ్మముహూర్తం నుండి ప్రారంభం
👉బాలాజీ మందిరం నుండి గల్లీ గల్లీ భజనలు
👉అన్ని ఆలయాల్లో హారతులు
జంగం మహేశ్వరులకు మంగళహారతులు
👉భక్తి, సంప్రదాయం, ఆరోగ్యం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ
మిగిలిన రోజుల్లో అందరూ భాగస్వామ్యం కావాలి
👉ఈ పవిత్ర ప్రభాత్ పేరి శనివారం వరకు కొనసాగనుంది. ఇంతవరకు పాల్గొనలేని భక్తులు తప్పనిసరిగా రావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
> “మన గ్రామ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చూపాల్సిన సమయం ఇది. అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి” — ప్రభాత్ పేరి కమిటీ విజ్ఞప్తి
—
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
