మద్నూర్, నవంబర్ 9:
కార్తీక మాస ప్రభాత్ పేరి కార్యక్రమాలు మద్నూర్ గ్రామంలో భక్తి పరవశంగా ముగిశాయి. ఆదివారం నాడు గ్రామంలోని శ్రీ బాలాజీ మందిరం ఆవరణలో ప్రభాత్ పేరి ముగింపు సందర్భంగా సామూహిక సత్యనారాయణ పూజ నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
గత 35 రోజులుగా బ్రహ్మముహూర్తంలో లేచి, గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ భజనలతో ఆలయాల ప్రదర్శన చేసిన భక్తులు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ముగింపు రోజున పెద్దలు, మహిళలు, యువత, పిల్లలు అందరూ పాల్గొని, కార్తీక ప్రభాత్ పేరిని భక్తి ఉత్సవంగా మార్చారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
