మద్నూర్,
మద్నూర్ మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి చేరేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు నాయకులను పిలుపునిచ్చారు.
అధ్యక్షుడు మాట్లాడుతూ—
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల ప్రజలకు భారీగా లాభాలు కలిగాయని, ముఖ్యంగా మద్నూర్ మండలానికి అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని, ఈ అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. అధిష్ఠానం సూచించినట్టు
ఐకమత్యం, సమన్వయం పాటిస్తూ
అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన వివరించారు.
గ్రామాలు–వార్డుల స్థాయి వరకు నాయకులు అహర్నిశలు చురుకుగా పనిచేయాలని సూచించారు.
అవసరం అయితే గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు మండల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఈ సమావేశంలో నాయకులు రామ్ పటేల్, సీనుపటేల్, హన్మంత్ యాదవ్, విట్టల్ గురిజి, హన్మంత్ దేశాయ్, మనోహర్ దేశాయ్, కొండ గంగాధర్, హన్మాండ్లు స్వామి, రమేష్ వటనల్, గడ్డం లక్ష్మణ్, సంగాయప్ప, కుషాల్, సాయిలు రాములు, బాలు, హన్మంత్, గోపి, ఆముల్, అఖీల్ శ్రేణులు, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
