మద్నూర్: మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్‌ఐగా రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మద్నూరులో విధులు నిర్వహించిన ఎస్‌ఐ విజయ కొండకు బీబీపేట్‌కు బదిలీ ఉత్తర్వులు జారితో, ఆయన స్థానంలో వి.ఆర్. నుండి ఎస్‌ఐ రాజును మద్నూర్‌కు బదిలీ చేశారు.
ఇదే సందర్భంగా, మద్నూరులో పనిచేసి సేవలు అందించిన ఎస్‌ఐ విజయ కొండకు పోలీస్ సిబ్బంది , గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేశారు. కొత్త ఎస్‌ఐ రాజు బాధ్యతలు చేపట్టడంతో పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా నూతన ఎస్ ఐ మాట్లాడుతూ చట్ట పరంగా నున్న ప్రజల సమస్య పట్ల ఎప్పటికప్పుడు తన వంతు ఆ సమస్యల పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
