మద్నూర్: మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వంచే అందుతున్న ఈ చీరలు పూర్తి క్వాలిటీతో, పేద కుటుంబాలకు నేరుగా ఉపయోగపడే విధంగా అందిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
కార్యक्रमంలో మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, ఆలయ ఛైర్మన్ రామ్ పటేల్, మాజీ సర్పంచ్ విట్టల్ గూరిజి, హన్మాండ్లు స్వామి, సురేష్ జుబ్రే, గంగారాం, మహిళ సంఘాల నాయకురాళ్లు, సెక్రటరీలు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ—పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోందని, ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
