ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ గారు మల్లికార్జున్ గారికి అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు.
జిల్లా కాంగ్రెస్ బలోపేతం కోసం సమిష్టిగా ముందుకు సాగాలని, నాయకులు–కార్యకర్తలను సమన్వయం చేసుకుని వ్యూహాత్మకంగా పనిచేయాలని మదన్ మోహన్ గారు సూచించారు. కామారెడ్డి జిల్లాలో సరికొత్త ఉత్సాహం సృష్టిస్తూ పార్టీ విజయాల కోసం కృషి చేస్తే తాను సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాయి పటేల్ కూడా పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
