• Sat. Dec 6th, 2025

“విద్యార్థి దశ లో శవధర్ రెడ్డి-లక్ష్మీకాంత్ స్నేహం — నేడు రాష్ట్ర శిఖరాల్లో కలయిక!”

BySangayappa matapathi

Oct 4, 2025

రాష్ట్ర పోలీసు విభాగం నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు, ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇద్దరూ జమ్మిచ్చి ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి దశలో పుట్టిన స్నేహం, నేడు రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో మళ్ళీ కలవడం అందరినీ ఆకట్టుకుంది.

ఒకరు రాష్ట్ర పోలీసు విభాగానికి అధిపతి,
మరొకరు ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధి.

వారి ప్రయాణం “చదువు, కృషి, సమర్పణ, స్నేహం” కలిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని చాటి చెబుతోంది.

ఈ కలయిక ప్రతి యువతకు స్పష్టమైన సందేశం ఇస్తోంది —
విద్య, కృషి, నిబద్ధతతో ముందుకు సాగితే, ఎత్తయిన శిఖరాలు అందుకోవడమే కాకుండా స్నేహం కూడా ఆదర్శంగా నిలుస్తుంది.

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *