జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు భరోసా కల్పించారు.
సోయా ధాన్యం కొనుగోలు అంశంపై శనివారం నాడు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారు ఫోన్‌లో మాట్లాడారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన ఎమ్మెల్యే గారికి, వారం రోజుల్లో సోయా కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని మార్క్‌ఫెడ్ చైర్మన్ గారు హామీ ఇచ్చారు.
రైతులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.
అదే సమయంలో ఢిల్లీలోని నాఫెడ్ అధికారులతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు.
వారం రోజుల్లో సోయా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోతే, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నేరుగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.
రైతుల పక్షాన నిలబడి, వారికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే గారి ఈ చర్యలను స్థానిక రైతులు హర్షంగా స్వాగతిస్తున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
