కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్‌పూర్ అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. టెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ సలాభాత్ పూర్ చెక్‌పోస్ట్‌పై గత నాలుగు నెలల క్రితం కూడా ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
తాజా దాడుల్లో ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద ₹10,200 నగదు, అదనంగా అక్రమంగా సేకరించిన మొత్తాలతో కలిపి మొత్తం ₹36,000 వరకు లెక్కల్లో తేలని డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఈ దాడులు కొనసాగుతున్నాయని, మొత్తం వివరాలు విచారణలో ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.తమ సిబ్బంది తో దాడులు విచారణ కొనసాగుతున్నాయి అని వివరించారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
