కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో జరుగుతున్న కార్తీక ప్రభాత్ ఫేరీ భక్తి భావనతో నిండి సాగుతోంది. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు చిన్నచిన్న గల్లీల్లోనూ భక్తులు హారతులు ఇస్తూ, భజనలతో ప్రభాత్ ఫేరీని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక చిన్నారి భక్తి భావన అందరినీ ఆకట్టుకుంటోంది. చేతికి గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ “నేను తప్పకుండా ప్రభాత్ ఫేరీకి వెళ్తాను” అంటూ మొండికేసి ప్రతి రోజూ పాల్గొంటూ ఆ చిన్నారి భక్తి అందరి మనసులను దోచుకుంది.
ఆ చిన్నారి భక్తి చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ “ఇది నిజమైన భక్తి భావనకు నిదర్శనం” అని ప్రశంసిస్తున్నారు. భజనలతో గ్రామ వీధుల్లో తిరగడం భక్తి పెంపొందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పలువురు తెలిపారు.
మద్నూర్ గ్రామంలో నెల రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రభాత్ ఫేరీ భక్తి, ఆరోగ్యం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. 🌸
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel

