పత్తి రైతులు సీసీఐ లో పత్తి అమ్ముకునే ముందు “కాపాస్ కిసాన్” యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
రైతులు ముందుగా తమ మొబైల్‌లో “Kapas Kisan App” డౌన్లోడ్ చేసుకొని, నమోదు చేసుకుని, అనంతరం స్లాట్ బుకింగ్ చేయాలి. జిల్లాలోని మద్నూర్‌లో గల కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్ను CCI సంస్థ L1 మిల్‌గా ఎంపిక చేసింది.
స్మార్ట్‌ఫోన్ లేని రైతులు AEOలు, మండల వ్యవసాయ అధికారులు లేదా AMC కార్యాలయాల ద్వారా స్లాట్ బుకింగ్ చేయించుకోవచ్చు. రైతులకు OTP ద్వారా ధృవీకరణ సందేశం వస్తుంది.
స్లాట్ బుకింగ్ లేకుండా పత్తిని CCI లో అమ్ముకోవడం సాధ్యం కాదు.
రైతులు తేమ శాతం 8% లోపు ఉండేలా పత్తిని అరబెట్టుకుంటే రూ.8110/- MSP ధర పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
