మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ ధరకు శనిగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి సంచి రూ.1500 సబ్సిడీ ధరకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, వ్యవసాయ శాఖ అధికారి రాజు, ఓబీసీ రాష్ట్ర నాయకుడు సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, శీను పటేల్, కొండ గంగాధర్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
—
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
