కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రం సీసీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ మద్నూర్ కృష్ణ నేచురల్ జిన్నింగ్ మిల్లును పరిశీలించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశంపై స్థానిక అధికారుల ద్వారా, అలాగే స్వయంగా మిల్లు స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీసీ కొనుగోలుకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
అగ్నిమాపక వివరాలు రైతులకు అవసరమయ్యే వివరాలను అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా ఆయన వెంట తహసిల్దార్ ముజీబ్, నాయబ్ తాసిల్దార్ కాలీద్, మార్కెట్ కార్యదర్శి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
