మద్నూర్ హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొత్తగా నిర్మించిన షెడ్‌కి పూజలు చేసి ప్రారంభించారు. ఇటీవల దుర్గామాత పూజ సందర్భంగా సమకూరిన ఒడిబియ్యంతో అన్నప్రసాదం వండి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు గ్రామస్తులు, సమీప గ్రామాల ప్రజలు కూడా పాల్గొన్నారు.
ఆలయ అన్నదాన కార్యక్రమంలో గంగారం సార్, శంకర్,
కె. రామారావు, కుశాల్, బాలాజీ, దాయల్ వార్, బండివార్ , నల్ల వార్ తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
