- మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సోయా కొనుగోలు కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మద్నూర్ సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులకు ప్రతి క్వింటాల్ సోయాకు గిట్టుబాటు ధర రూ.5,328గా ప్రభుత్వం నిర్ణయించడం రైతులకు ఉపశమనం కలిగిస్తుందన్నారు.
రైతుల కష్టానికి న్యాయం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలతో పాటు పంటల కొనుగోలులో కూడా ప్రభుత్వం ముందంజలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌనజన్య రమేష్, సీనుపటేల్, దరస్ సాయిలు, రాంపటేల్, రమేష్, హన్మాండ్లు, గోపి, గంగాధర్, హన్మంత్, ఆముల్ తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
