తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు ఈరోజు హైదరాబాదులోని సీఎం నివాసంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ —
“ముఖ్యమంత్రి గారు భగవంతుడి ఆశీస్సులతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను,” అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి శుభాకాంక్షలను స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పుష్పగుచ్ఛం అందజేసి, సీఎం గారితో స్నేహపూర్వకంగా పలకరించి అభినందించారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
