జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో R&B మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించిన ఎమ్మెల్యే, దుర్దశలో ఉన్న రహదారులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
R&B శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతిపై వివరాలు సేకరించిన ఆయన, పనులను పూర్తి స్థాయిలో, నాణ్యంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు పనులు వేగంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
అలాగే పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంచి రోడ్లు ప్రజల అభివృద్ధికి పునాది అవుతాయని, ప్రభుత్వం లక్ష్యం నాణ్యమైన–సురక్షితమైన రహదారులే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
