కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గూడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి సవిత గారి నూతన గృహాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా గృహహీనులందరికీ ఇళ్ల మంజూరు జరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలల గృహాలను నిజం చేస్తోందని తెలిపారు.
అతను మాట్లాడుతూ, “ఇల్లు లేని ప్రతి కుటుంబం సొంత ఇల్లు కలిగి సంతోషంగా జీవించాలి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వ ధ్యేయం” అని అన్నారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఓబీసీ నాయకుడు సాయి పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరస్ సాయిలు, సొసైటీ చైర్మన్ శీనుపేటేల్, హన్మాండ్లు స్వామి, విట్టల్ గురిజి, రమేష్ వటనల్ , గడ్డం లక్షమన్,కొండ గంగాధర్, జావిద్ ,గోపి ,హన్మంత్, ఆముల్ , చిన్న,స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
