మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక గారి అధ్యక్షతన మద్నూర్ మరియు డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు మరియు VOA లకు ‘అమ్మకు అక్షరమాల’ (ఉల్లాస్) కార్యక్రమంపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మహిళా సంఘాల్లో చదువుని అందుకోలేని మహిళలకు ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు దుర్గ మరియు సంగీత శిక్షణ అందించారు. ఈ సందర్భంగా అక్షర వికాసం పుస్తకంలోని ముఖ్య అంశాలను వారికి వివరించారు.
ఈ పుస్తకంలో ఉన్న మనము చదవగలం, ఆదాయం పెంచుకుందాం, పోషకాహారం, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే విధానం, చట్టాన్ని తెలుసుకుందాం వంటి విషయాలను స్పష్టంగా శిక్షణలో వివరించారు.
అక్షరాస్యత కార్యక్రమం ప్రభావవంతంగా సాగేందుకు గ్రామ సంఘాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సమాఖ్య APM జగదీశ్ కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీలు, అకౌంటెంట్, గ్రామ సంఘాల పాలకవర్గ సభ్యులు మరియు VOA లు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
