*జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరా మహిళ శక్తి చీరాల పంపిణీ మద్నూర్ లో కార్యక్రమం ప్రారంభం*
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “ఇందిరా మహిళ శక్తి” పథకం భాగంగా, జుక్కల్ నియోజకవర్గంలో మహిళలకు నాణ్యమైన చీరాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశాల మేరకు, ప్రతి మండలంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు చక్కని క్వాలిటీతో కూడిన చీరలు అందిస్తున్నారు.
మద్నూర్ మండలంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది చీరలను గ్రామం గ్రామానికి పంపిణీ చేయడం మహిళల్లో ఆనందాన్ని వ్యక్తం చేసింది.
మహిళలు మాట్లాడుతూ—
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ నాణ్యతగల చీరలు పంపిణీ చేసినప్పటికీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తున్న చీరలు అద్భుతమైన క్వాలిటీ, రంగు, మెటీరియల్ ఉన్నాయని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు: ,ఎంపీడీఓ రాణి ,ఎమ్మర్వో ముజీబ్ ఏపీఎం జగదీష్ ,ఏమిఈవో వెంకట నర్సయ్య
కాంగ్రెస్ నాయకులు:
దరాస్ సాయిలు రామ్ పటేల్ ,సీనుపటేల్ ,హన్మాండ్లు స్వామికొండ గంగాధర్ ,రమేష్ వటనల్ వార్ ,సంతోష్ మెస్ట్రీ ,గోపి ,బాలు హన్మాండ్లు
,ఐకేపీ – ఉపాధి హామీ శాఖ సిబ్బంది: పద్మ ,సంగీత ,నాగలక్ష్మి ,కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ,
“మహిళల గౌరవం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. గ్రామీణస్థాయిలో మహిళలకు నాణ్యమైన చీరలు అందించడం అభినందనీయం,” అని చెప్పారు.
జుక్కల్ నియోజకవర్గంలో చీరాల పంపిణీ కార్యక్రమం మరిన్ని గ్రామాల్లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
