జుక్కల్ నియోజకవర్గంలో రైతులు విస్తృతంగా సాగు చేసే సోయా విత్తనాలు, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి ముందడుగు మేరకు, బుధవారం పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఇక్రిసాట్ శాస్త్రవేత్తల బృందం మద్నూర్ మండలంలో పర్యటించింది.
శాస్త్రవేత్తలు గోదాంలను పరిశీలించి, స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు విక్రయ సమస్యలు తగ్గడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని అభిప్రాయపడ్డారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
