బిచ్కుంద పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే గారు తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐలమ్మ గారి సేవలు మరువరానివని పేర్కొన్నారు. ప్రతి మహిళా ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వేడుకలో పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రావు దేశాయ్, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, పట్టణ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ, వైస్ చైర్మన్ యాదవ్ రావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
