• Thu. Jun 4th, 2026

సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో 216 సత్యనారాయణ వ్రతాలు

Avatar photo

BySangayappa matapathi

Nov 5, 2025

కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు.
ఈ వ్రతాలకు దాదాపు 25 సంవత్సరాలుగా ఆలయంలో సంప్రదాయంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సత్యనారాయణ వ్రతం ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యం ఉన్నదని పూజారులు పేర్కొన్నారు. మద్నూర్ మండలమే కాకుండా మూడు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామ్ పటేల్,పరమేష్ పటేల్,దరస్ సాయిలు, హన్మంత్ యాదవ్,హన్మాండ్లు స్వామి,ఆలయ పూజరీలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *