మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ శిఖరం, స్లాబ్ మరియు ఇతర పునర్నిర్మాణ పనులకు స్థానిక భక్తులు సహకారం అందిస్తున్నారు.
ఈ క్రమంలో మద్నూర్‌కు చెందిన సంతోష్ మెస్ట్రీ ఆలయ అభివృద్ధి నిమిత్తం తన వంతుగా ₹51,000 విరాళం అందజేశారు. ఆయన ఈ సహాయాన్ని అందించిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సంతోష్ మెస్ట్రీ చూపిన ఈ ఉదారత ఇతరులకు స్ఫూర్తిదాయకమని, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
