• Thu. Jun 4th, 2026

మద్నూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధికి ₹51,000 విరాళం ఇచ్చిన సంతోష్ మెస్ట్రీ

Avatar photo

BySangayappa matapathi

Oct 29, 2025

మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ శిఖరం, స్లాబ్ మరియు ఇతర పునర్నిర్మాణ పనులకు స్థానిక భక్తులు సహకారం అందిస్తున్నారు.
ఈ క్రమంలో మద్నూర్‌కు చెందిన సంతోష్ మెస్ట్రీ ఆలయ అభివృద్ధి నిమిత్తం తన వంతుగా ₹51,000 విరాళం అందజేశారు. ఆయన ఈ సహాయాన్ని అందించిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సంతోష్ మెస్ట్రీ చూపిన ఈ ఉదారత ఇతరులకు స్ఫూర్తిదాయకమని, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *