మద్నూర్‌లో ఘనంగా రావణ దహనం
మద్నూర్ మండలకేంద్రంలోని ఎల్లమ్మ బండల్లో విజయదశమి పండుగను ఈ ఏడాది మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రతీ ఏటిలాగే ఈసారి కూడా రావణ దహనం ఘనంగా నిర్వహించగా, వేలాది మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఉద్యోగానిమిత్తం బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వగ్రామానికి చేరుకుని ఉత్సవాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరితో ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
