• Tue. Jun 2nd, 2026

నూతన డీజీపీగా బి. శివధర్ రెడ్డి ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

Avatar photo

BySangayappa matapathi

Sep 27, 2025
  • హైదరాబాద్:
    తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డి గారిని ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీ (ఇంటెలిజెన్స్)గా విశేష సేవలు అందించిన శివధర్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర పోలీస్ విభాగానికి ప్రధాన అధికారి బాధ్యతలు చేపట్టడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో విద్యార్థి దశలోనే శివధర్ రెడ్డి గారు మరియు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి రోజుల్లో ఎమ్మెల్యే గారికి సీనియర్‌గానూ ఉన్న శివధర్ రెడ్డి గారు, ఆ పరిచయం నేటికీ సన్నిహిత స్నేహంగా కొనసాగుతుండటం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *