మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా థేగ్లూర్ పట్టణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుకు ఘన సన్మానం లభించింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికలు నేపథ్యంలో స్థానిక పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా అక్కడి నాయకులు ఎమ్మెల్యేకు శాలువ కప్పి, బొక్కేనా అందించి ఘనంగా సన్మానించారు.
నాయకుల ఆతిథ్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, ప్రజల అభివృద్ధి కోసం సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మొగులాజీ, తెలంగాణ నాయకులు సాయి పటేల్, రామ్ పటేల్, సాయిలు, పరమేష్ పటేల్, రమేష్, ఆముల్, అజీమ్, బాలు షిండే తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
