జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు, పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పై అధికారులతో చర్చించారు.
ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలి, పేదలకు నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు.
సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
