మద్నూర్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, ఆయన ప్రజల కోసం చేస్తున్న సేవలను స్మరించుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరస్ సాయిలు, సీనుపటేల్,హన్మంత్ యాదవ్,హన్మాండ్లు స్వామి,రమేష్ వటనల్ వార్, కొండ గంగాధర్ ,మహేష్, గోపి,,దేవిదాస్,మనోహర్ , శివాజీ, సంతోష్ మెస్త్రి,సంగ్రామ్ పటేల్, ఆముల్,,చెందు,లక్ష్మణ్, ఈరన్న ,సాయిబాబా,సంతోష్, బండి హన్మాండ్లు,దిగంబర్ తదితరులు పాల్గొన్నారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel

