• Thu. Jun 4th, 2026

మద్నూర్ విద్యార్థి యోగేష్ చౌడేకర్ గోల్డ్ మెడల్ – మద్నూర్ గ్రామనికే గర్వకారణం!

Avatar photo

BySangayappa matapathi

Nov 7, 2025

మద్నూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతుడు యోగేష్ చౌడేకర్ గారు 2020–21 విద్యా సంవత్సరంలో శాతవాహన యూనివర్సిటీ నుండి Msc లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో విశిష్ట ప్రతిభ కనబర్చి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవా వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి అద్భుతమైన పట్టుదల, కృషి, నిబద్ధతతో రాష్ట్ర స్థాయిలో సత్కారం పొందడం మద్నూర్ ప్రజలకు గర్వకారణమైంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు, ఉద్యోగులు యోగేష్ విజయాన్ని హర్షాతిరేకంగా అభినందించారు.
యోగేష్ తండ్రి సంతోష్ ఉపాధ్యాయులు ఉండడం కూడా విద్య విభాగంలో కూడా గర్వకారణం గా భావిస్తున్నారు

గ్రామస్థుల వారి మాటల్లో –

> “గ్రామీణ ప్రాంతం నుండి కూడా ఆణిముత్యాలుగా ఎదగవచ్చని యోగేష్ నిరూపించాడు. ఆయన లాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి విద్యార్థి కలగాలి” అని పలువురు అభిప్రాయపడ్డారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *