కామారెడ్డి జిల్లా మద్నూర్ ఉమ్మడి మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్–ప్రీతం పాటిల్ దంపతుల కుమార్తె రోశ్ని పాటిల్ ప్రతిభతో రాణించారు.
కామినేని హాస్పిటల్ – ఎల్.బి.నగర్ లో గవర్నమెంట్ కోటా ద్వారా, 699 ర్యాంక్ తో ఎంబీబీఎస్ సీటు పొందడం ద్వారా ఆమె అసాధారణ ప్రతిభను చాటుకున్నారు.
ఈ విజయంతో గ్రామం మొత్తం గర్వపడుతోంది. కృషి, పట్టుదల, నిబద్ధతకు ఫలితం దక్కిందని తోటి విద్యార్థులు, గురువులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రోశ్ని పాటిల్ భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
