• Thu. Jun 4th, 2026

1. “రోశ్ని పాటిల్ ప్రతిభ – ఆడపిల్లల చదువుకు ఓ గర్వకారణం”

Avatar photo

BySangayappa matapathi

Sep 21, 2025

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ ఉమ్మడి మండలంలోని సుల్తాన్ పెట్  గ్రామానికి చెందిన రాజ్ కుమార్–ప్రీతం పాటిల్ దంపతుల కుమార్తె రోశ్ని పాటిల్ ప్రతిభతో రాణించారు.
కామినేని హాస్పిటల్ – ఎల్.బి.నగర్ లో గవర్నమెంట్ కోటా ద్వారా, 699 ర్యాంక్ తో ఎంబీబీఎస్ సీటు పొందడం ద్వారా ఆమె అసాధారణ ప్రతిభను చాటుకున్నారు.

ఈ విజయంతో గ్రామం మొత్తం గర్వపడుతోంది. కృషి, పట్టుదల, నిబద్ధతకు ఫలితం దక్కిందని తోటి విద్యార్థులు, గురువులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రోశ్ని పాటిల్ భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *