మద్నూర్ మండల కేంద్రంలోని రతన్ గల్లీలో శేత్కారి గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 1976లో వ్యవసాయ కుటుంబాలు ప్రారంభించిన ఈ శేత్కారి గణేష్ ఉత్సవం, చిన్నా పెద్దా వృద్ధులు,యువకులు అందరినీ కలుపుతూ భక్తి సందడి కొనసాగిస్తోంది.
సువర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వాహకులు వేలాది మందికి నిత్యం అన్నదానం నిర్వహించగా, చివరి రోజు ప్రతి ఇంటికీ ప్రత్యేక శ్రద్ధతో వేలాది ఇండ్లకు లడ్డు ప్రసాదం అందేలా కృషి చేశారు. గ్రామస్థులు, భక్తులు ఈ విశిష్ట సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ, నిర్వాహక యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
