భారత మాజీ ప్రధానమంత్రి, దేశ చరిత్రలో ఐరన్ లేడీగా నిలిచిన late శ్రిమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతిని డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
1971 యుద్ధ విజయం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ పటం మీద నిలబెట్టినవారు, బ్యాంకుల జాతీయీకరణ వంటి మహత్తర నిర్ణయాలతో పేదల, రైతుల సంక్షేమానికి కృషి చేసిన నాయకురాలి సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.దేశ అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన ఇందిరాగాంధీ గారి త్యాగం దేశ యువతకు స్ఫూర్తిగా ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజు దేశాయ్,ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,శివాజీ పటేల్,పురుషోత్తం పటేల్,ఉమాకాంత్ పటేల్,నగేష్ పటేల్
ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు
🙏 ఇందిరా గాంధీ గారికి నివాళులు — ఓం శాంతి 🙏
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
