• Thu. Jun 4th, 2026

మన్మథస్వామి పాదయాత్రలో సోమయప్ప స్వామీజీకి హారతులు ..పాదయాత్ర లో నడిచిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు

Avatar photo

BySangayappa matapathi

Nov 1, 2025

మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి 250 కిలోమీటర్లు దూరం లో 10 రోజుల పాటు కొనసాగుతున్న పాదయాత్రలో మహారాష్ట్ర పరళి లో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీకి హారతులు చేస్తూ దివ్య దర్శనం అందుకున్నారు. ఈ సందర్భంగా సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ దాతగా పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులతో కలిసి మద్నూర్ నాయకులు జెండా పట్టుకొని పాదయాత్రలో నడిచారు.
యాత్ర అనంతరం భక్తులు మహారాష్ట్రలోని పరళి జ్యోతిర్లింగ శ్రీ వైద్యనాథ్ ఆలయం, అలాగే కాపిల్ధార్ మన్మథస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర సేవ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో రామ్ పటేల్, మద్నూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరస్ సాయిలు, యువజన అధ్యక్షుడు హన్మంత్ యాదవ్ ,దేవిదాస్,హన్మాండ్లు, సాయిలు,,రాములు తదితరులు ఉన్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *