కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు.
ఈ వ్రతాలకు దాదాపు 25 సంవత్సరాలుగా ఆలయంలో సంప్రదాయంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సత్యనారాయణ వ్రతం ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యం ఉన్నదని పూజారులు పేర్కొన్నారు. మద్నూర్ మండలమే కాకుండా మూడు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామ్ పటేల్,పరమేష్ పటేల్,దరస్ సాయిలు, హన్మంత్ యాదవ్,హన్మాండ్లు స్వామి,ఆలయ పూజరీలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
