• Thu. Jun 4th, 2026

మద్నూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా – జై భీమ్ నినాదాలతో మారుమోగిన వేడుకలు

BySangayyappa Matapathi

Apr 14, 2026

మద్నూర్, ఏప్రిల్ 14:
మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. “జై భీమ్” నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. నాయకులు అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉషా సంతోష్ మెస్త్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, పరమేష్ పటేల్, రామ్ పటేల్, ప్రజ్ఞకుమార్, సీనుపటేల్, కొండ గంగాధర్, కృష్ణ పటేల్, గోపి బండివార్, హన్మంత్ యాదవ్, హన్మంత్ గలిబివార్,  రాములు యాదవ్,గలిబి హన్మంత్, హన్మంత్ రావు దేశాయ్, అశోక్, సంతోష్ పటేల్, జవీద్, దేవిదాస్ పటేల్, సాయిలు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *