మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ గారు గౌరవనీయులు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు గారిని కలిసి, స్థానిక ఆసుపత్రి పనులు నిలిచిపోయిన విషయాన్ని వివరించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు గారు, పల్లె దవాఖాన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అయ్యేలా అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ అశోక్ గారు తెలిపారు.
అలాగే ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలపై కూడా ఎమ్మెల్యే గారితో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
గ్రామ అభివృద్ధికి సంబంధించి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం పట్ల గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మెనూర్ పల్లె దవాఖాన పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు కి వినతి
