• Thu. Jun 4th, 2026

మద్నూర్‌లో కుమ్మరి సమాజం ఆధ్వర్యంలో భక్తి, భజన, అన్నదానం

BySangayyappa Matapathi

Apr 15, 2026

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో బుధవారం కుమ్మరి కులస్థుల ఆరాధ్య దైవమైన సంత్ గోరోభా కాకా పుణ్యతిథి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి భక్తులు జాగరణ భజనలతో దేవుని స్మరించగా, బుధవారం మధ్యాహ్నం గులాల్ భజన, కీర్తనలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భక్తుల హృదయాలను ఆకట్టుకునేలా భజనలు సాగాయి.
హరతీ అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టి, సేవా కార్యక్రమంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పండరీపురం విఠలేశ్వరుని పరమ భక్తుడిగా సంత్ గోరోభా కాకా విశేష ఖ్యాతి పొందారని తెలిపారు. దశాబ్దాలుగా కుమ్మరి సమాజం అంతా ఒక్కటిగా కలసి ఈ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం ఆనందకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గంగారం, జలభ, దత్తు, విజయ్, సంజేయ్, గంగాధర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భక్తి, సేవా భావం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *