మద్నూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ మందిర్ ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములు, పూర్వ స్వాములు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావాన్ని వ్యక్తం చేశారు.
అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు.
మద్నూర్‌లో ఘనంగా అయ్యప్ప జన్మదిన వేడుకలు – అన్నదానంతో సేవా సందేశం
