మద్నూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం, దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని, రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
“బుద్ధం శరణం గచ్ఛామి” మంత్రంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉషా సంతోష్ మెస్త్రి, మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, ప్రజ్ఞకుమార్, జవీద్, హన్మంత్ గలిబి, తుకారం, గోపి, రాములు, అశోక్, కృష్ణ పటేల్, అరుణకుమారి, హన్మంత్ రావు దేశాయ్ తదితర దళిత నాయకులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మద్నూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జెండా ఆవిష్కరణ పలువురు వక్తల ప్రసంగం
