కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రజలకు ఉపశమనం కలిగించే గొప్ప సేవ కార్యక్రమం ప్రారంభమైంది. పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయ సేవ సమితి ఆధ్వర్యంలో ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మెస్త్రి, మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. హనుమాన్ సేవ సమితి చేస్తున్న ఈ సేవా కార్యక్రమం ఆదర్శప్రాయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కర్ల సాయిలు, హన్మంత్ గలిబి, జవీద్, రాములు తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్‌లో హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం ఎండల తీవ్రతలో ప్రజలకు ఉపశమనం –
