• Thu. Jun 4th, 2026

మద్నూర్‌లో హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం ఎండల తీవ్రతలో ప్రజలకు ఉపశమనం –

BySangayyappa Matapathi

Apr 14, 2026

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రజలకు ఉపశమనం కలిగించే గొప్ప సేవ కార్యక్రమం ప్రారంభమైంది. పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయ సేవ సమితి ఆధ్వర్యంలో ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మెస్త్రి, మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. హనుమాన్ సేవ సమితి చేస్తున్న ఈ సేవా కార్యక్రమం ఆదర్శప్రాయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కర్ల సాయిలు, హన్మంత్ గలిబి, జవీద్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *