• Thu. Jun 4th, 2026

మద్నూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దరాస్ సాయిలు రెండోసారి నియామకం ఎమ్మెల్యే,జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కు ధన్యవాదాలు

BySangayyappa Matapathi

May 6, 2026

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి దరాస్ సాయిలు మరోసారి నాయకత్వం వహించనున్నారు. మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దరాస్ సాయిలును రెండోసారి నియమిస్తూ జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయిలో కృషి చేయడం, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు సాధించేందుకు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అలాగే బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించేందుకు దరాస్ సాయిలు చేసిన కృషి ప్రశంసనీయమని నాయకులు తెలిపారు.
ఇకపై కూడా పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని దరాస్ సాయిలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, సంతో పటేల్ ,కొండ గంగాధర్, మాజీ చైర్మన్ శివాజీ ,సంతోష్ మెస్త్రి,మహేష్ పటేల్, దేవిదాస్, మున్న,ఈరన్న,ప్రకాష్,సలీం, హన్మంత్ ,సాయిలు, గంగాధర్, తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *